ETV Bharat / state

BIRDS: నగరాలలో పక్షుల వలసలు.. ప్రమాదమన్న శాస్త్రవేత్తలు - latest news in vishaka

ఈ ప్రపంచం సకల జీవరాశులకు ఆలవాలం. ఆధునిక పోకడలతో పక్షిజాతులు ప్రమాదంలో పడుతున్నాయి. చాలా రకాల పక్షులు నగరాలు, పట్టణాల నుంచి వలస వెళ్తున్నాయి. ఇందువల్ల పక్షుల సంఖ్య తగ్గి జీవవైవిధ్యం ఏర్పడుతోందని పరిశోధకులు చెబుతున్నారు. దేశీయ పక్షులను కాపాడుకొలేని స్థితిలో పురప్రాంతాలు ఉన్నాయి. ఈ సమస్యపై విశాఖలోని గీతం స్కూల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్లు చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు పరిశోధన చేశారు. ఇందులో భాగంగా పక్షుల కోసం అపార్టుమెంట్లలో, గృహాల్లో, వాణిజ్య భవనాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేసుకుంటే పర్యావరణానికి మేలు అనే కోణంలోనూ దృష్టి సారించారు.

birds
నగరాలలో పక్షుల వలసలు
author img

By

Published : Sep 26, 2021, 6:13 PM IST

నగరాలలో పక్షుల వలసలు

విశాఖలోని గీతం స్కూల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌కు చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు జ్యోతి మిశ్రా, డాక్టర్‌ దిబ్యాజీవన్‌ పతి.. పుర ప్రాంతాల్లో పక్షుల మనుగడపై పరిశోధన చేశారు. ఇందులో భాగంగా తూర్పుతీర ప్రాంతమైన విశాఖలో పరిశోధించి కీలక విషయాలు తెలిపారు.

సముద్రతీరం కావడంతో తరచూ కొన్ని దేశీయజాతుల పక్షులు ఇక్కడ సంచరిస్తుంటాయి. నగరంలో నిత్యం రద్దీగా ఉండి జనసాంద్రత ఎక్కువగా ఉండే దాబాగార్డెన్, జగదాంబకూడలి, ద్వారకానగర్‌ ప్రాంతాల్లో గృహ, వాణిజ్య సముదాయాల్ని పరిశోధించాము. ఇక్కడ తిరిగే పక్షుల్లో ఎక్కువగా గోరింక, పావురాలు, కాకులు లాంటివి కనిపించాయి. నీడకోసం, ఆహారం కోసం ఇవి చాలా అవస్థలు పడుతున్నట్లుగా గమనించాము. భవనాల్లో ఉండేందుకు, ఆహారం దొరికేందుకు ఏర్పాట్లు లేకపోవడంతో.. ఎత్తయిన భవనాల్లో శాశ్వతంగా ఉండే చోటును పక్షులు వెతుక్కుంటున్నాయి. ఆహారాన్ని సేకరించుకొని తిరిగి ఈ ఆవాసాలను చేరి సేద తీరుతున్నాయి. సన్‌షేడ్, దిమ్మెలు, ఏసీ యూనిట్లు తదితరాలున్నచోట గూళ్లు కట్టుకున్నాయి. ముఖ్యంగా ఇక్కడి పావురాలు ఎతైన భవనాల మీదకెళ్లి అక్కడ తెరచి ఉన్న కిటికీల్ని, ఏసీ యూనిట్లని ఆశ్రయిస్తున్నాయి. జనాలరద్దీకి దూరంగా ప్రశాంతంగా ఉండేందుకు అవి ప్రయత్నిస్తున్నాయని గమనించాము. -పరిశోధకులు

పూర్వపు రోజుల్లో ఇళ్ల నిర్మాణాల్లోనే పక్షులకు చిన్న ఆవాసాలను నిర్మించేవారు. నేడు ఆ పద్ధతి మరుగున పడింది. దీంతో పక్షులు తీగలు, స్తంభాలపై ఆధారపడుతున్నాయి. వీటి మనుగడ కోసం తిరిగి ఆధునిక నిర్మాణ సరళిని తీసుకురావాలని పరిశోధకులు చెబుతున్నారు. ఈమేరకు భవనాల డిజైన్లలో మార్పు కోసం కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండీ.. Gulab Effect: ఉత్తరాంధ్రలో గులాబ్ తుపాను.. శ్రీకాకుళంలో భారీ వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.