విశాఖలోని సింహాద్రి అప్పన్న సన్నిధిలో ఘాట్ రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించారు. సాయంత్రం 6 గంటల నుంచి కొండపైకి వెళ్లే వాహనాలను నిలిపివేశారు. రెండు వారాల పాటు నిబంధనలు అమలులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఈసమయంలో స్వామివారి దర్శనాలు రాత్రి 7 గంటలకే నిలుపుదల చేస్తామని తెలిపారు. భక్తులు ఈవిషయాన్ని గమనించాలని అధికారులు కోరుతున్నారు. భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతున్న కారణంగా వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు విస్తరణ పనులు చేపట్టామన్నారు. ఘాట్ రోడ్డు యు మలుపులో పెద్ద బండరాయి ఉండడంతో బాంబు బ్లాస్ట్ పనులు చేయనున్నారు. ఆలయ పండితులు ఘాట్ రోడ్డు మలుపు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో రామచంద్రమోహన్ పనులను ప్రారంభించారు.
ఇది కూడా చదవండి.