విశాఖ జిల్లా భీమిలి మండలం తగరపువలసలో లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారులు షాపులు తెరిచారు. రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులకు అనుమతులు ఇస్తూ మందుబాబులను విచ్చలవిడిగా ప్రభుత్వం వదిలేసిందన్నారు. ప్రజలకు అవసరమైన ఎలక్ట్రికల్, గృహోపకరణాల షాపులకు మాత్రం నిబంధనలు విధించడం సమంజసం కాదని వ్యాపారులు పేర్కొన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఇవాళ ఉదయం తగరపువలసలోని అన్ని షాపులను తెరవడంతో ప్రజలు వారికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేశారు.
ఇవీ చదవండి: పెట్రో సుంకం పెంపుతో కేంద్రానికి ఇంత లాభమా?