విశాఖలో కరోనా విజృంభిస్తున్న వేళ.. స్వచ్ఛంద సంస్థలు సేవలు ప్రజల్లో ధైర్యాన్ని నింపుతున్నాయి. ప్రభుత్వ సంస్థల మీద ఆధార పడకుండా.. పెదగంట్యాడ 75వ వార్డులో పీబీఆర్ ట్రస్ట్ చైర్మన్ పులి వెంకటరమణారెడ్డి నేతృత్వంలో.. రసాయన ద్రావణం పిచికారీ చేయించారు. జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతంలో బ్లీచింగ్ పౌడర్ చల్లించారు.
ఎవరికి వారు స్వీయ జాగ్రత్తలు పాటిస్తూ.. కరోనా మహమ్మారిని దైర్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని అత్యవసరం అయితే తప్ప ఎవరు బయటకు వెళ్లవద్దని పీబీఆర్ ట్రస్ట్ ద్వారా విజ్ఞప్తి చేశారు. వార్డ్ కార్పొరేటర్ ధనలక్ష్మి ఈ కార్యక్రమంలో పాల్గొని కరోనా వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
ఇవీ చూడండి: