ETV Bharat / state

పంట చుట్టూ... చీర కట్టు.. అదిరేట్టు! - పంట చుట్టూ రక్షణగా విశాఖలో చీరలు

చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది అంటూ... మగువకు చీర కట్టు తెచ్చిన అందం గురించి వర్ణించాడు ఓ సినీ కవి. ఆరు మూరల చీర కట్టినప్పుడు ఆడ పిల్ల అందం అమాంతం పెరిగి ఎంతటి వాళ్ల చూపునైనా తిప్పుకోనివ్వదు. అంతటి ఘనత కలిగిన మన భారతీయ సాంప్రదాయ చీర... పంటను చుట్టుకోని రక్షణ కవచంగా మారింది. పచ్చని పంటను చుట్టుకున్న రంగు రంగుల చీరలు హరివిల్లును తలపిస్తున్నాయి.

crop as protection
చీర కట్టు
author img

By

Published : Oct 18, 2020, 4:44 PM IST

చీర కట్టు తెచ్చే వన్నెలు అనంతం. సాంప్రదాయంతో పాటు, మగువ అందాన్ని పెంచే చీర కట్టు అంటే నచ్చని భారతీయుడు ఉండడంటే అతీశయోక్తి కాదు. అలాంటి రంగు రంగుల చీరలు పంటకు రక్షణగా మారి చూపరులను ఆకట్టుకుంటోంది.

విశాఖ జిల్లా కె సంతపాలెం రైతులు మొక్కజొన్న పంట చుట్టూ రక్షణగా చీరలు కట్టారు. పశువులు ఇతర జంతువులు పాడు చేయకుండా కట్టినట్లు అన్నదాతలు చెప్పారు. పచ్చని మొక్కజొన్న పంట చుట్టూ చక్కగా కట్టిన చీరలు రకరకాల రంగుల్లో హరివిల్లును తలపిస్తున్నాయి.

ఇదీ చదవండి:

కబ్జాకు గురవుతున్నా పట్టించుకోరా.. కార్పొరేటర్​పై స్థానికుల దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.