ETV Bharat / state

Rushikonda Was Destroyed by the YSRCP Government: భవిష్యత్​లో పేరుకే రుషి'కొండ'.. 90 శాతానికి పైగా విస్తీర్ణంలో నిర్మాణాలకు అనుమతులు - cases on Rushikonda issue

Rushikonda Was Destroyed by the YSRCP Government: విశాఖ నగరానికి మణిమకుటంలా భాసిల్లే రుషికొండ భవిష్యత్తులో కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉంది. కొండపై ఏకంగా 90 శాతానికి పైగా విస్తీర్ణంలో నిర్మాణాలకు అనుమతులిచ్చేశారు. అవన్నీ పూర్తయితే ఇక రుషికొండ పేరుకే మిగులుతుంది తప్ప అక్కడ కొండన్నది ఉండదు. రుషికొండ బీచ్‌కు దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. దీన్ని బ్లూ ఫ్లాగ్ బీచ్‌గా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. పర్యాటకులు దీన్ని విశాఖ గోవాగా పిలుస్తుంటారు. అలాంటి బీచ్‌కు వెన్నెముకగా ఉండే రుషికొండను వైఎస్సార్సీపీ ప్రభుత్వం విధ్వంసం చేసింది.

Rushikonda_Was_Destroyed_by_the_YSRCP_Government

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 15, 2023, 7:05 AM IST

Rushikonda Was Destroyed by the YSRCP Government: రుషికొండ భవిష్యత్తులో కనుమరుగయ్యే ప్రమాదం..మోసపూరితంగా 21 ఎకరాల్లో కొండను తొలిచిన ప్రభుత్వం

Rushikonda Was Destroyed by the YSRCP Government: ఎండాడ సర్వే నంబర్లు 19/1, 19/3, 19/4లో మొత్తం 69.65 ఎకరాల్లో విశాఖ నగరానికి మణిమకుటంలా భాసిల్లే రుషికొండ విస్తరించి ఉంది. కొండపై రిసార్ట్స్ పునర్నిర్మాణం పేరిట గతంలో ఉన్న స్థలంలో కంటే అదనంగా రుషికొండ (Rushikonda)ను తవ్వేస్తున్నారని జనసేన పార్టీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ 2021 డిసెంబరులో హైకోర్టును (Rushikonda Hill Case) ఆశ్రయించారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, ఎంపీ రఘురామకృష్ణ రాజు కూడా పిటిషన్లు వేశారు.

Over 90 Percent of the Area on Rushikonda has Construction Permits : పర్యాటకశాఖ అధికారులు 9.88 ఎకరాల విస్తీర్ణంలో హరిత రిసార్ట్స్ పునర్నిర్మాణానానికి కేంద్ర పర్యావరణ, అటవీశాఖ నుంచి అనుమతి పొందారు. తర్వాత మోసపూరితంగా 21 ఎకరాల్లో కొండను తొలిచేశారు. National Green Tribunal (NGT), సుప్రీంకోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా తవ్వేశారు. ఇది కోర్టు ధిక్కరణ అంటూ మూర్తి యాదవ్‌ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానాల్లో కేసులు ఉండగానే పర్యాటకశాఖ 61 ఎకరాల్లో నిర్మాణాలకు ప్లాను కోసం మరోసారి GVMCకి దరఖాస్తు చేసింది.

Retired IAS EAS Sharma Comments On Rushikonda Issue: "రుషికొండలో పర్యావరణ చట్టాల ఉల్లంఘన.. ప్రజాప్రతినిధులు చట్టాలకు అతీతులు కాదు"

కేంద్ర పర్యావరణ, అటవీశాఖ ఇచ్చిన అనుమతులకు విరుద్ధంగా Greater Visakhapatnam Municipal Corporation (GVMC) ప్లాన్‌ మంజూరు చేసేసింది. గతంలో 5.99 ఎకరాల విస్తీర్ణంలో రిసార్టులు ఉండేవి. ఇప్పుడు అనుమతులు పొందిన విస్తీర్ణం ఏకంగా 61 ఎకరాలకు చేరుకుంది. ఈ లెక్కన ఖాళీ స్థలాల పన్ను కింద 100 కోట్ల వరకు GVMCకి చెల్లించాల్సి ఉంది. ఈ విషయాన్ని రెండు శాఖల అధికారులూ పట్టించుకోలేదు.

CM Jagan Decisions Danger to Rushikonda : రుషికొండ విస్తీర్ణం 69.65 ఎకరాలైతే అందులో ఏకంగా 61 ఎకరాల్లో కట్టడాలకు GVMC ప్లాను మంజూరు చేశారు. ఇది మొత్తం విస్తీర్ణంలో 90 శాతానికి పైమాటే. ప్రస్తుతం 21 ఎకరాల్లో కొండను తొలిచేశారు. భవిష్యత్తులో మిగతా 40 ఎకరాల్లోనూ నిర్మాణాలు చేపట్టే అవకాశం ఉంది. అదే జరిగితే రుషికొండ పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.

Bandaru allegations On Rushikonda Lease: 'కుళాయి రూ.6లక్షలు, బాత్రూం ఖర్చు కోటి.. పేద ముఖ్యమంత్రి కోసం విలాసవంతమైన భవనం'

ప్లాను పొందే సమయంలో ఏయే నిర్మాణాలు చేస్తున్నారో GVMCకి కచ్చితంగా తెలియజేయాల్సి ఉన్నా, ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న నిర్మాణాలకు భవన రుసుముల కింద 19.05 కోట్లు చెల్లించాలి. వాటిని అయిదేళ్లలో సర్దుబాటు చేసేలా వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

Coastal Regulation Zone (CRZ) నిబంధనల ప్రకారం తీరం పక్కన భూగర్భ జలాలను తోడకూడదు. కానీ ఇక్కడ హైస్పీడ్‌ బోర్లతో నీరు తోడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే పూర్తయిన నిర్మాణాల చుట్టూ రహదారులను నిర్మిస్తున్నారు.

Committee Report is Nominal to Shifting of Administration Activities to Vizag: వైజాగ్‌కు అడ్మినిస్ట్రేషన్ కార్యకలాపాలు..కమిటీ నివేదిక తూతూ మంత్రమే అంటూ విమర్శలు!

శ్వేతపత్రం విడుదల చేయాలి: రుషికొండను తొలిచేసి, పర్యాటక శాఖ కట్టడాలను లీజు పేరుతో కాజేయడానికి సీఎం జగన్‌ కుట్ర పన్నారని మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆరోపించారు. రుషికొండపై నిర్మిస్తున్న విశాలవంతమైన భవనానికి కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్న ముఖ్యమంత్రి.. పేదవాడినంటూ ప్రచారం చేసుకోవటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆ భవనాల కోసం చేస్తున్న ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.