విశాఖ జిల్లా యలమంచిలి మండలం పెద్దపల్లి సమీపంలో.. జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. విశాఖ నుంచి ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై.. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం వెళ్తుండగా అదుపుతప్పిన వాహనం డివైడర్ ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న ముద్రగడ శ్రీను (19) అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ వెనుక కూర్చున్న అయుధం పోతురాజు (30) తీవ్రంగా గాయపడ్డాడు. అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేశారు.
ఇవీ చదవండి: