విశాఖ జిల్లా మాడుగుల మండలంలో నాటుసారా తయారీ కేంద్రాలపై ఆబ్కారీ శాఖ పోలీసులు దాడులు జరిపారు. ఒమ్మలి జగన్నాథపురం ప్రాంతంలో దాడులు నిర్వహించారు. నాటుసారా తయారికి ఉపయోగించే 1,400 లీటర్ల బెల్లం ఊట గుర్తించి, ధ్వంసం చేసినట్లు మాడుగుల ఆబ్కారీ శాఖ సీఐ జగదీశ్వరరావు వెల్లడించారు. నాటుసారా తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: 'రఘురామకృష్ణరాజు సవాల్‌పై సీఎం జగన్ స్పందనేంటి?'