విశాఖ జిల్లా తూర్పు కోస్తా రైల్వే వాల్తేర్ డివిజన్ మర్రిపాలెంలో ఆర్పీఎఫ్ పోలీసుల కోసం ఆధునిక వసతులతో కూడిన బ్యారక్‌ను పునరుద్ధరించినట్లు వాల్తేరు సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ జితేంద్ర శ్రీవాస్తవ తెలిపారు. బ్యారక్‌లో ఏర్పాటు చేసిన వసతుల్ని డీఆర్‌ఎం చేతన్‌కుమార్, శ్రీవాస్తవ వీడియో కనెక్టివిటీ ద్వారా పరిశీలించారన్నారు. రూ.35 లక్షలతో ఆరు నెలల్లో బ్యారక్‌ను అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. ఆధునిక వంట గదితోపాటు టెబుల్ టెన్నిస్, మినీ క్రీడా ప్రాంగణం, బ్యాడ్మింటన్ కోర్టు, ఫుట్ మసాజర్, సైక్లింగ్, జిమ్ సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు.
ఇవీ చూడండి..