విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం దేవరాపల్లి - పినకోట మార్గంలో శారదా నదిపై వంతెన నిర్మాణ పనులు ఆరేళ్లుగా అసంపూర్తిగా ఉన్నాయి. దీంతో ఇటీవల కురిసిన వర్షాలకు కాజ్వే కొట్టుకుపోయింది. అనంతగిరి, హుకుంపేట, దేవరాపల్లి మండలాలకు చెందిన దాదాపు 100 గ్రామాల ప్రజలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రైవాడ జలాశయం గేట్లు ఎత్తి వరద నీటిని విడుదల చేయడంతో కాజ్ వే కొట్టుకుపోయి, ప్రయాణం ప్రమాదంగా మారింది. అయినప్పటికీ అసంపూర్తిగా ఉన్న వంతెనపై నుంచి ప్రమాదకరమని తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. దీనిపై ఈటీవీ-ఈటీవీ భారత్లో కథనం ప్రచారం చేసింది.
కథనానికి స్పందించిన ప్రభుత్వం విప్ బూడి ముత్యాలనాయుడు వంతెన నిర్మాణానికి పూనుకున్నారు. అధికారులతో మాట్లాడి నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయించారు. తాత్కాలికంగా రాకపోకలు సాగించేందుకు 41 లక్షల రూపాయలతో వంతెన ఇరువైపుల అప్రోచ్ పనులు పటిష్టంగా చేపట్టారు. ప్రస్తుతం ఈ పనులు తుదిదశకు చేరుకోవడం రాకపోకలకు వంతెన సిద్దమయ్యింది. అప్రోచ్ నిర్మాణానికి కృషి చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడుకి పలు గ్రామాల గిరిజనులు, రైతులు ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నారు.
ఇవీ చూడండి...