విశాఖ జిల్లా ఆనందపురం మండలం కణమాంలో రైతు భరోసా కార్యక్రమానికి మంత్రి అవంతి శ్రీనివాసరావు హాజరయ్యారు. వేమగొట్టిపాలెంలోని వాగ్వాదంలో మరణించిన శిణగం రమణ కుటుంబీకులు మంత్రికి వినతిపత్రం అందజేశారు. అతని మృతికి కారణమైన నిందితులను అరెస్టు చేయాలని మృతుడి భార్య డిమాండ్ చేశారు.
స్పందించిన మంత్రి .. బాధితులకు న్యాయం చేయాలని సీఐ రవికి సూచించాారు. ఈ విషయమై సీఐని వివరణ కోరగా ఇప్పటికే కేసులో ఒకరిని అదుపులోకి తీసుకుని.. కోర్టు ఆదేశాల మేరకు రిమాండుకు తరలించామని వెల్లడించారు. విచారణ చేస్తున్నట్టు చెప్పారు.
ఇదీ చూడండి: