విశాఖ జిల్లా మాడుగుల మండలం పెద్దేరు జలాశయం నీటి మట్టం మళ్లీ ప్రమాదస్థాయికి చేరుకుంది. ఎగువ ప్రాంతం నుంచి జలాశయంలోకి 44 క్యూసెక్కుల మేరకు అదనపు నీరు వచ్చి చేరుతోంది. దీంతో నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 137 మీటర్లు కాగా... ప్రస్తుతం 136.50 మీటర్ల వద్ద ఉంది. అప్రమత్తమైన జలాశయం అధికారులు స్పిల్ వే గేట్లు ఎత్తి 200 క్యూసెక్కుల అదనపు నీటిని దిగువ నదిలోకి పెడుతున్నారు.
ఇదీ చదవండి: