ETV Bharat / state

రాపిడ్‌ కిట్లు వచ్చేశాయ్..‌!

కరోనా వైరస్‌ను నిర్ధారించే పరీక్షలకు ఉపయోగించే ర్యాపిడ్​ కిట్లను అధికారులు విశాఖ జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలకు చేరవేశారు. ఇకనుంచి పీహెచ్‌సీల్లోనే కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు.

రాపిడ్‌ కిట్లు వచ్చేశాయ్‌!రాపిడ్‌ కిట్లు వచ్చేశాయ్‌!
రాపిడ్‌ కిట్లు వచ్చేశాయ్‌!
author img

By

Published : Apr 26, 2020, 7:12 PM IST

విశాఖ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా వైరస్‌ను నిర్ధారించే పరీక్షలు నిర్వహించనున్నారు. అవసరమైన ర్యాపిడ్‌‌ కిట్లను జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయం నుంచి అన్ని పీహెచ్‌సీలకు చేరవేశారు.వేములపూడి వైద్యాధికారి సుజాత తొలిరోజు 19 మందికి వీటి ద్వారా పరీక్షలు నిర్వహించారు. ప్రాంతీయ ఆసుపత్రిలోనూ ట్రూనాట్‌ పరికరాల ద్వారా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం వరకు 1116 మందికి పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగిటివ్‌ రావడం ఊరట కలిగించింది. కరోనా అనుమానిత రోగులకు ర్యాపిడ్‌ కిట్ల ద్వారా మంగవరం, పాయకరావుపేట, శ్రీరాంపురం పీహెచ్‌సీల పరిధిలో పరీక్షలు ప్రారంభించినట్లు వైద్యులు మధుబాబు తెలిపారు.

ముమ్మరంగా కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు

కేజీహెచ్‌ ఆవరణలోని ప్రాంతీయ వైరాలజీ ల్యాబ్‌లో ఆర్టీపీసీఆర్‌, ట్రూనాట్‌, సీబీనాట్‌ ద్వారా కరోనా నిర్ధారణ పరీక్షలు ముమ్మరమయ్యాయి. తక్కువ సమయంలోనే పదివేలకు పైగా పరీక్షలు చేశారు. ఏఎంసీ ప్రిన్సిపాల్‌ పీవీ సుధాకర్‌ ఆధ్వర్యంలో వైరాలజీ విభాగ ప్రొఫెసర్లు టెక్నీషియన్లు, ఐసీఎంఆర్‌ శాస్త్రవేత్తలు పరీక్షలు చేస్తున్నారు. ఈ నెల 6న వైరాలజీ ల్యాబ్‌, ఈ నెల 11 నుంచి ట్రూనాట్‌, సీబీనాట్‌ యంత్రాల ద్వారా పరీక్షలు ప్రారంభించారు. శనివారం వరకు మొత్తం 10,684 నమూనాలను పరీక్షించారు. వీటిలో ఆర్టీపీసీఆర్‌ ద్వారా 7592, ట్రూనాట్‌ ద్వారా 3092 పరీక్షలు చేశామని సుధాకర్‌ చెప్పారు.

క్వారంటైన్‌ కేంద్రం ఏర్పాటు

ఎస్‌.రాయవరం అడ్డరోడ్డు సమీపంలో క్వారంటైన్‌ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్‌ వేణుగోపాల్‌ తెలిపారు. హైదరాబాద్‌, చెన్నై నగరాల నుంచి నడుచుకుంటూ వచ్చిన 17 మందిని ఈ కేంద్రంలో ఉంచారు.

కొవిడ్‌ పరీక్షలకు తల్లీ కుమారుడు

దిల్లీ నుంచి గత నెల 19న దేవరాపల్లి వచ్చిన తల్లీ, కుమారుడిని కొవిడ్‌-19 పరీక్షల నిమిత్తం శనివారం సాయంత్రం విశాఖలోని ఛాతి ఆసుపత్రికి తరలించారు. వీరిద్దరూ ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో విశాఖపట్నం వచ్చి అక్కడి నుంచి దేవరాపల్లి చేరుకున్నారు. ఆ రోజు వీరితోపాటు అదే రైలులో ఒకే బోగీలో ప్రయాణించిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అప్రమత్తమైన అధికారులు... ఆ బోగీలో ప్రయాణించిన వారి వివరాలను సేకరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.