ETV Bharat / state

సింహాచల క్షేత్రం... జల సంరక్షణ కేంద్రం - vizag

తూర్పు కనుమల అందాల నడుమ కనిపించని నీటిని ఒడిసి పట్టడంలో సింహాచలం దేవస్థానం ఎన్నో అడుగుల ఎత్తులో నిలుస్తోంది. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో జాతీయ స్థాయి గుర్తింపును సొంతం చేసుకుంది. పచ్చని చెట్లను కప్పుకుని నిత్యం శోభాయమానంగా, ఆహ్లాదకరంగా ప్రకృతి సొబగుల నడుమ కళకళలాడే సింహాచలం కొండల్లో చేపట్టిన వాన నీటి సంరక్షణ చర్యలపై "ఈటీవీ భారత్" ప్రత్యేక కథనం...

అప్పన్న క్షేత్రం... జల సంరక్షణ కేంద్రం
author img

By

Published : Jun 16, 2019, 9:33 AM IST

అప్పన్న క్షేత్రం... జల సంరక్షణ కేంద్రం

విశాఖ నగరంలో అడుగుపెట్టగానే ఎవరికైనా మొదట కనిపించేది ఓ వైపు పచ్చని కొండలు... మరోవైపు నీలి సాగర తీరం. తూర్పు కనుమల ఆకర్షణ ప్రకృతి వరంగా ఉన్నా... నగరంలో ఏటా కనిపిస్తున్న నీటి ఎద్దడి సమస్య తీవ్రమవుతూనే ఉంది. ఆ దిశగా నగర వాసుల్లో పర్యావరణ స్పృహ పెరగాల్సిన ఆవశ్యకతపై ఎన్నో ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగా సింహాచలం దేవస్థానం చేపట్టిన వాననీటి సంరక్షణ చర్యలకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. జల వనరుల శాఖ ప్రతిష్టాత్మకంగా అందించే జల అవార్డుల జాబితాలో ఉత్తమ జల సంరక్షణ విధానాలు అవలంభించిన ధార్మిక సంస్థగా సింహాచలం దేవస్థానం నిలిచింది.

ప్రతి నీటిబొట్టును ఒడిసి పడుతూ...
సాధారణంగా కొండలపై వాన కురుస్తోందంటే ఆ నీరంతా పల్లానికి పారుతూ పోతుంది. విశాఖలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఎంత వర్షం కురిసినా ఆ నీరంతా సముద్రం పాలు కావాల్సిందే అన్నట్లు నగరంలో పరిస్థితి ఉంటోంది. ఈ సమస్యపై దృష్టి సారించిన సింహాచలం దేవస్థానం ప్రత్యేక చర్యలు చేపట్టింది. సుమారు 6 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సింహాచలం కొండపై సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నీటి సంరక్షణకు శ్రీకారం చుట్టింది. వర్షపు నీటిని ఒడిసి పట్టేలా కొండపైనా, కింద కాలువలు తవ్వారు. ఆ నీరంతా నాలుగు బావుల్లోకి చేరేలా చేశారు. అత్యంత శాస్త్రీయంగా ఇంజక్షన్ బావుల్ని ఏర్పాటు చేయడం ద్వారా నేరుగా భూగర్భ జలాలు పెరిగేందుకు దోహదం చేసే మార్గాన్ని చూపారు.

కొండ కింద 13 బోర్లు...
కొండ కింద ఉండే గోశాల పరిసరాల్లో 13 బోర్లు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది అంతా నిత్యం నీటిని అందించే స్థాయిలో ఉండడానికి ఇంజక్షన్ బావులే ఓ కారణమని అధికారులు భావిస్తున్నారు. కొండపైన సైతం నీటి సమస్యను అధిగమించడం సాధ్యమైందని చెబుతున్నారు. 12 వేల క్యూబిక్ మీటర్ల మేర కాంటూరు ట్రెంచులు తవ్వడం సహా చెక్ డ్యాంలు నిర్మించడం వంటివి ఉత్తమ ఫలితాలను ఇచ్చాయి.

సింహాచలం కొండల్లో చేపట్టిన వాన నీటి సంరక్షణ చర్యలు సమాజానికే ఆదర్శం. ఇటువంటి కార్యక్రమాలు అన్ని క్షేత్రాల్లో చేపట్టడం అవసరం.

ఇదీ చదవండీ: 2000 కోట్లు.... ఏడు గోపురాలు... 55 అడుగులు

New Delhi, June 15 (ANI): Prime Minister Narendra Modi arrived in the national capital today. He arrived in Delhi after concluding his two-day visit to Bishkek and Kyrgyzstan. In PM's two-day visit he participated in the Shanghai Cooperation Organisation (SCO) Summit 2019.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.