మహిళలు, దళితులపై దాడులకు వ్యతిరేకంగా ప్రజా, హక్కుల సంఘాలు,వామపక్ష రాజకీయ పార్టీలు విశాఖ జిల్లా సీపీఐ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. బాధితులకు సత్వర న్యాయం జరగడం లేదని, వారి పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నందుకు కేసులు నమోదు చేయడం ఏమిటని ప్రశ్నించారు. రానున్న కాలంలో వీటి నివారణకు పటిష్టమైన చట్టాలను అమలు చేసేందుకు ఉమ్మడి కార్యాచరణ చేపట్టాలని కోరారు. దాడులకు వ్యతిరేకంగా ఈ నెల 13వ తేదీన విశాఖలో ప్రదర్శన, అనంతరం బహిరంగ సభ నిర్వహించాలని తీర్మానించారు.
ఇదీ చదవండీ...'ఏడాదిన్నర పాలనలో ఉత్తరాంధ్ర, రాయలసీమకు చేసిందేంటి?'