విశాఖ నగరంలోని గాంధీ బొమ్మ వద్ద అఖిల భారత కార్మిక ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. 46వ రోజు దీక్షలో కార్మికులు, నేతలు పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకుంటామని కార్మిక నేతలు అంటున్నారు. కొవిడ్ బాధితులకు ఆక్సిజన్ అందించి.. ప్రాణాలు కాపాడుతున్న సంజీవిని లాంటి ఉక్కు పరిశ్రమను అమ్మే ఆలోచన.. కేంద్రం మానుకోవాలని నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: కొవిడ్ బాధితులు, వారి బంధువులకు అన్నదానం