నాటుసారా రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్టు - liquor raidsnews in visakha
నాటుసారా బట్టీలపై విశాఖ జిల్లాలో విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. నాటుసారా విక్రయాలు జరుపుతున్న వారిని అరెస్టు చేసి సరకు స్వాధీనం చేసుకున్నారు.
![నాటుసారా రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్టు police raids on natusrara making centers in visakha](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7757648-471-7757648-1593017465455.jpg?imwidth=3840)
police raids on natusrara making centers in visakha
విశాఖ జిల్లాలో నాటు సారా తయారీ, రవాణా, అమ్మకం చేస్తున్న వారిపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు దాడి చేసి గుట్టు రట్టు చేశారు. అనకాపల్లి మండలం మామిడిపాలెం గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. పిల్లి నాగరాజు అనే వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. 150 నాటుసారా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. చోడవరం మండలం వెంకన్నపాలెం గ్రామం నుంచి నాటుసారా తీసుకొస్తున్నట్లు సమాచారం రాాగా పోలీసులు దాడులు చేశారు. వెంకన్నపాలెం గ్రామంలో దాడులు నిర్వహించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి 500 నాటు సారా ప్యాకెట్లు స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్ట్ చేశారు.
ఇదీ చూడండి