ETV Bharat / state

గిరిజనులకు అండగా పోలీసులు

author img

By

Published : Jun 21, 2020, 8:02 PM IST

పౌరసేవలో భాగంగా మారుమూల ప్రాంతం గిరిజనులకు సీఆర్​పీఎఫ్​, సివిల్ పోలీసులు పలు క్రీడా సామగ్రి, నీటి బకెట్లను అందజేశారు. గిరిజనులతో మమేకమవుతూ తోడుగా ఉంటామంటూ జి.మాడుగుల సీఐ డప్పు వాయించి గిరిజనులను ఉత్తేజపరిచారు.

గిరిజనులకు నీటి బకెట్లను అందజేస్తున్న పోలీసులు

విశాఖ ఏజెన్సీ ప్రాంతం దుర్మతిలో 198 బెటాలియన్ సీఆర్పీఎఫ్ పోలీసులు జి.మాడుగుల సివిల్ పోలీసులు పౌర సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమారు మూడు లక్షల విలువైన నీళ్ల బకెట్లను, వాలీబాల్, క్రికెట్, క్యారంబోర్డు వంటి క్రీడా సామగ్రిని గిరిజనులకు పంపిణీ చేశారు.

గిరిజన యువత అన్నీ విధాలుగా ముందుండాలని జి.మాడుగుల సీఐ బాబు అన్నారు. ఏ సమస్యలు ఉన్నా పోలీసులు తోడుగా ఉంటారని భరోసా ఇచ్చారు. విశాఖ జిల్లా పోలీసుల తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. సంఘ విద్రోహ చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు.

ఇదీ చూడండి: కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రులు : మంత్రి ఆళ్ళ నాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.