ఖాకీల కనికరం.. గిరిజనులకు సహాయం - విశాఖలో గిరిజనులకు పోలీసుల సహాయం
ఖాకీల మాటున ఉన్న కనికరాన్ని చూపిస్తూ.. విశాఖ జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు నిత్యావసరాలు పంచారు. 5 రోజులకు సరిపడా సరకులను గిరిజనులకు అందించారు.
విశాఖ గిరిజనులకు నిత్యావసరాలు పంచిన పోలీసుల
విశాఖ జిల్లా మారుమూల గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు పోలీసులు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ముంచంగిపుట్టు, రూడకోట పోలీసులు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన అయినకుమాడ, చినసరియపల్లి, బొక్కిలిపుట్టు గ్రామాల్లో గిరిజనులకు సరకులు అందజేశారు. ఇతర ప్రాంతాల నుంచి వారి గ్రామాలకి ఎవరైనా వస్తే తమకు చెప్పమని సూచించారు. గ్రామాల్లో ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నా సమాచారమివ్వాలని కోరారు.
ఇవీ చదవండి.. నిస్సహాయ బాలికకు సాయం.. ప్రధాని మాటలే స్ఫూర్తి