ఆంధ్ర - ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. బెజ్జంగి ప్రాంతంలో మంగళవారం వెలిసిన మావోయిస్టు గోడ పత్రికలతో విస్తృతంగా సోదాలు చేపడుతున్నారు. రూడకోట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై దీనబంధు నేతృత్వంలోని బృందాలు అణువణువూ జల్లెడ పడుతున్నారు. ద్విచక్రవాహనాలు, బస్సులు తనిఖీలు చేస్తూ... అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందిన నేపథ్యంలో పోలీసులు ఈ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు.
ఇదీ చూడండి: