ETV Bharat / state

ట్రాఫిక్‌ పెండింగ్‌ చలానాలపై రాయితీ - పోలీసుల స్పందన ఇదే - TRAFFIC POLICE CLARITY ON CHALLANS

ట్రాఫిక్‌ పెండింగ్‌ చలానాలపై రాయితీ అంటూ సోషల్ మీడియాలో వైరల్

Telangana Traffic Police Clarity On Pending Traffic Challan Discount Claims
Telangana Traffic Police Clarity On Pending Traffic Challan Discount Claims (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 13 hours ago

Telangana Traffic Police Clarity On Pending Traffic Challan Discount Claims : తెలంగాణలో ట్రాఫిక్‌ పెండింగ్‌ చలానాలపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి రాయితీ ఇచ్చిందని, గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఉన్నత అధికారులు స్పందించారు. పెండింగ్‌ చలానాలపై రాయితీ వార్తలను ట్రాఫిక్‌ పోలీసులు ఖండించారు. పెండింగ్‌ ట్రాఫిక్‌ చలానాలపై ఎలాంటి రాయితీ లేదని ట్రాఫిక్‌ పోలీసులు స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారం నమ్మొద్దని ట్రాఫిక్‌ అదనపు సీపీ విశ్వ ప్రసాద్‌ విజ్ఞప్తి చేశారు. అటువంటి విధానం అమల్లోకి వస్తే ముందుగానే ప్రకటిస్తామని అన్నారు. తప్పుడు ప్రచారాలు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారురు. echallan.tspolice.gov.in వెబ్‌సైట్‌లోని సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ఆయన వాహనదారులకు సూచించారు. ఎవరికైనా అనుమానాలు ఉంటే హెల్ప్‌లైన్ నెంబర్లు 040 27852772, 27852721 కు ఫోన్‌ చేసి సమాచారం పొందవచ్చని తెలిపారు.

AP High court on Traffic Rules Violation : ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారనేలా ప్రజలకు ఓ సందేశాన్ని పంపాల్సిన అవసరం ఉందని ఏపీ హైకోర్టు పేర్కొంది. రహదారులపై తనిఖీలు చేసి నిబంధనలు పాటించని వారికి అక్కడికక్కడే జరిమానాలు విధించాలని, అప్పుడే వాహనదారుల్లో భయం ఉంటుందని తెలిపింది. పోలీసులు రోడ్లపై ఉంటే నేరం చేయడానికి సిద్ధపడ్డ వాళ్లు కూడా భయపడి వెనక్కి తగ్గడమో, వాయిదా వేయడమో చేస్తారని వ్యాఖ్యానించింది. మోటారు వాహన చట్ట నిబంధనలు అమలు చేయకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరిగి, భారీ సంఖ్యలో మరణిస్తున్నారంటూ న్యాయవాది తాండవ యోగేశ్‌ గతంలో ఏపీ హైకోర్టులో పిల్​ వేశారు.

దీనిపై ఇటీవల విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం, ట్రాఫిక్​ ఐజీని వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో తాజాగా బుధవారం దీనిపై ధర్మాసనం విచారణ చేపట్టగా, కోర్టు ముందు డీజీపీ కార్యాలయం నుంచి ఐజీ ఆకే రవికృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసులు క్రియాశీలకంగా వ్యవహరించాలని గుర్తు చేస్తూ పలు విషయాలను ఏపీ హైకోర్టు ప్రస్తావించింది. సీసీటీవీ కెమెరాల ఆధారంగా చలానాలు వేసే విధానాన్ని తగ్గించాలంటూ పోలీసులకు ఆదేశించింది. జరిమానా విధించిన సొమ్మును 90 రోజుల్లో చెల్లించకపోతే వాహనాన్ని జప్తు చేయొచ్చన్న నిబంధనను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించింది.

విజయవాడలో ట్రాఫిక్ సమస్యపై 'అస్త్రం' - డ్రోన్ ద్వారా సమస్యకు చెక్ : సీపీ

ట్రాఫిక్ సమస్యకు చెక్! - ఇంజినీరింగ్ విద్యార్థుల సరికొత్త ఆవిష్కరణ - Traffic Management System

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.