విశాఖలోని అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆస్పత్రిలో వ్యాక్సిన్ కోసం ప్రజలు పాట్లు పడుతున్నారు. రెండో డోసు టీకా వేసుకునేందుకు అధిక సంఖ్యలో ప్రజలు ఆసుపత్రికి వచ్చారు. అందుకు తగ్గట్టుగా వ్యాక్సిన్ డోసులు అందుబాటులో లేని కారణంగా నిరాశ చెందారు. టీకాలు లేవని చాలా మంది వెనుదిరిగారు. ఈ సమస్యపై వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు.
ఇదీ చదవండి: