విశాఖ జిల్లాలో పింఛనుదారులు ఆందోళనకు దిగారు. నాలుగు రోజులుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ తమను పట్టించుకోవడం లేదని వారు వాపోయారు. ఇంట్లో ఎంతమంది అర్హులుంటే వారందరికీ పింఛన్లు ఇస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పిన జగన్..... ఇప్పుడు ఇల్లు, కరెంట్ బిల్లులను సాకుగా చూపడమేంటని మండిపడ్డారు. తామేమీ చేయలేమని... పైనుంచి వచ్చిన జాబితాలో ఉన్నవారికి మాత్రమే పింఛన్లు ఇవ్వగలమని అధికారులు చెబుతున్నారు. అర్హులైన వారందరూ...దరఖాస్తు చేస్తే పింఛన్లు తప్పకుండా ఇస్తామని వైకాపా ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తెలిపారు.
ఇవీ చదవండి...కొత్త నిబంధనలతో కష్టాలు..పింఛను రాక వృద్ధుల రోదన