విశాఖ జిల్లా మాడుగుల మండలం పెద్దేరు జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ నుంచి జలాశయంలోకి అదనపు నీరు వస్తోంది. రైతుల విన్నపం మేరకు అధికారులు జలాశయం నుంచి రాచకట్టు కాలువకు 10 క్యూసెక్కుల మేర సాగునీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 137 మీటర్లు.
ప్రస్తుతం 136.65 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. ఈ కారణంగా.. సాగునీరు రబీ సాగుకు పుష్కలంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది రబీకి సాగునీటిని విడుదల చేశారు. ఆయకట్టు ప్రాంత రైతులు వరి, ఇతర ఆరుతడి పంటల సాగు దిశగా అడుగులు వేస్తున్నారు.
ఇదీ చదవండి: