ప్రైవేటు పాఠశాలల్లో ఫీజు తగ్గింపును అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. విశాఖలోని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. డీఈవో కార్యాలయం వద్ద తల్లిదండ్రులు చేస్తున్న ఆందోళన రెండో రోజుకి చేరగా.. రాత్రైనా, చలిలోనే నిరసన కొనసాగించారు.
ప్రైవేటు పాఠశాలల్లో 30 శాతం ఫీజు తగ్గించాలని ప్రభుత్వం జీవో నెం.57ను జారీ చేసిందని వారు గుర్తు చేశారు. యాజమాన్యాలు కచ్చితంగా ఆ జీవోను అమలు చేయాలని, ఫీజులు తగ్గించాలని వారు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
బొర్రా గుహల నుంచి.. చిమిడిపల్లి సెక్షన్లో నీటి సరఫరా వ్యవస్థ ప్రారంభం