మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు జులై 28 నుంచి ఆగస్టు 3 వరకు విశాఖ మన్యంలో నిర్వహించేందుకు మావోయిస్టు పార్టీ సన్నాహాలు చేసింది. దీనిని తిప్పి కొడుతూ పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. మన్యంలో మావోయిస్టు హిట్ లిస్ట్ లో ఉన్న రాజకీయ నేతలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పాడేరు డీఎస్పీ రాజ్ కమల్ సూచించారు.
మావోయిస్టు ఉత్సవాల పేరుతో గిరిజనులను మభ్యపెట్టి అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని డీఎస్పీ అన్నారు. గ్రామాల్లో అపరిచితులు ఎవరైనా వస్తే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. మారుమూల ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేయడంతో పాటు... బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, డ్రోన్ కెమెరాలతో నిఘా కట్టుదిట్టం చేసినట్లు డీఎస్పీ ప్రకటించారు. మావోయిస్టులు గ్రామాల్లో సంచరించి ప్రజలను భయబ్రాంతులకు గురి చేసి ఇన్ఫార్మర్లుగా మార్చుకుంటున్నారని... దీనిని గిరిజనులు తిప్పికొట్టాలని డీఎస్పీ రాజ్ కమల్ స్పష్టం చేశారు.