ETV Bharat / state

ఆస్తి తగాదాలతో గిరిజనుడు హత్య - rangini gudem murder case

వారిద్దరూ దూరపు బంధువులు.. తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి కోసం తగాదా పడుతుండేవారు. ఆస్తి గొడవ మరింత ముదరటంతో ఆ బంధువు.. మరో వ్యక్తిని పొడిచి చంపేశాడు. ఈ ఘటన విశాఖ మన్యం రంగినిగూడలో జరిగింది.

one person murder
గిరిజనుడు హత్య
author img

By

Published : Sep 3, 2020, 11:33 AM IST

విశాఖ మన్యం ముంచంగిపుట్టు మండలం బుంగాపుట్టు పంచాయతీ రంగిని గూడలో ఆస్తి కోసం ఓ వ్యక్తి మరో వ్యక్తిని కత్తితో పొడిచి చంపాడు. రంగిని గూడకు చెందిన కిల్లో బాబులు, జిన్నులు దూరపు బంధువులు. వీరద్దరి మధ్య తాతముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చిన భూమి గురించి తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో ఈ వివాదం మరింత ముదరటంతో కిల్లో బాబులును జిన్ను కత్తితో పొడిచి చంపాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: ద్విచక్రవాహనం అదుపుతప్పి యువకుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.