విశాఖ జిల్లా చీడికాడ మండలం కోనాం జలాశయం పరిధిలోని దండిసురవరం సాగునీటి కాలువ ఆక్రమణకు గురైంది. దీంతో ఆయకట్టు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కాలవ సమీపంలోని ఓ వ్యాపారి భూములను కొనుగోలు చేశారు. ఆ భూములు చదును చేసి.. పక్కనే ఉన్న సాగునీటి కాలువలు గట్టుపై ఉన్న తాటిచెట్లు కూలదోసి కాలువను చదువు చేశాడు. 400 ఎకరాలకు సాగునీరు అందటంలేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు.
తెదేపా, వైకాపా నాయకులు, ఆయకట్టు రైతులు కలిసి జలవనరుల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై జలవనరుల శాఖ డీఈఈ ఉషారాణి, ఏఈ రామారావు, ఆర్.ఐ రామారావు సాగునీటి కాలువ ప్రాంతాన్ని పరిశీలించారు. తక్షణమే కాలువ ఏర్పాటు చేయాలని చదును చేసిన వ్యక్తిని ఆదేశించారు. లేకుంటే శాఖ పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సాగునీటి కాలువను ఆక్రమించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆయకట్టు రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: విశాఖలో స్థానికల ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు