ETV Bharat / state

మంచు తెరల అందం... నయనానందం - vishaka agency latest news

విశాఖ మన్యంలోని వంజంగి కొండపై మంచు తెరల అందాలు పర్యాటకుల మనసు దోచేస్తున్నాయి. లాక్​డౌన్ నిబంధనలు సడలించటంతో ఈ ప్రాంతానికి ప్రకృతి ప్రేమికులు వస్తున్నారు. సహజసిద్ధమైన అందాలను చూసి పులకించిపోతున్నారు.

Vanjangi Hill
Vanjangi Hill
author img

By

Published : Sep 19, 2020, 11:27 PM IST

Vanjangi Hill
అందాలను సెల్​ఫోన్​లో బంధిస్తూ...

విశాఖ మన్యంలోని పాడేరు ప్రకృతి అందాలకు నెలవు. ముఖ్యంగా పాడేరు సమీపంలోని వంజంగి కొండపై మంచు అందాలు ఎవరి మనసునైనా ఇట్టే దోచేస్తాయి. మేఘాలు నేలజారాయా అన్నట్టు కొండలపై మంచు తెరలు తేలియాడాయి. వర్షాకాలంలోనూ ఇవి కనువిందు చేస్తున్నాయి. లాక్​డౌన్ నుంచి సడలింపులు రావటంతో ప్రకృతి ప్రేమికులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు. సహజసిద్ధమైన ఈ అందాలను చూసి మైమరచిపోతున్నారు. సెల్ఫీలతో సందడి చేస్తున్నారు.

గతంలో గిరిజనులకు డోలీ కష్టాలు అంటూ ఈటీవీ కథనం ప్రసారం చేయటంతో వంజంగి కొండపై ఎనిమిది కిలోమీటర్ల మేర ఘాట్ రహదారి నిర్మించింది ప్రభుత్వం. దీనివల్ల పర్యాటకులకు సైతం ఇబ్బందులు తప్పాయి. నేరుగా వాహనాల్లో కొండపైకి వెళుతున్నారు. వేకువజాము నుంచి ఈ రమణీయ దృశ్యాలు వీక్షించేందుకు పోటీ పడుతున్నారు.

Vanjangi Hill
కుటుంబ సమేతంగా
Vanjangi Hill
మేఘాలను తలపిస్తున్న మంచు తెరలు
Vanjangi Hill
రమణీయ దృశ్యం
Vanjangi Hill
కొండపై చిన్నారుల సందడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.