Nara Lokesh key comments on the three capitals: మన ఇంట్లో చెత్త పక్కింట్లో వేస్తే బంగారం కాదు కాదా అంటూ, అధికార వైసీపీలో సీట్ల మార్పుపై తెలుగుదేశ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. యువగళం పాదయాత్ర 225వ రోజూ విశాఖ జిల్లాలో కొనసాగుతుంది. పెందుర్తి నియోజకవర్గంలోకి ప్రవేశించిన లోకేశ్ కు వెంకటాపురం గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. కార్యకర్తలు, అభిమానులకు లోకేశ్ కరచాలనం చేస్తూ ముందుకు సాగారు. భారీ సంఖ్యలో మహిళలు, స్థానికులు, కార్యకర్తలు పాల్గొని, యువనేతకు మద్దతుగా నడిచారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఐటీ ఉద్యోగులు లోకేశ్ కు సంఘీభావం తెలిపారు. సింహాచల పంచ గ్రామాల సమస్య తెలుగుదేశంతోనే పరిష్కారమవుతుందని, లోకేశ్ హామీ ఇచ్చారు.
యువగళం విజయోత్సవ జైత్రయాత్ర సభ - ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసిన టీడీపీ
సైకో జగన్ విధ్వంసం ఆరంభించి నాలుగేళ్లైంది: మూడు ముక్కలాటతో ప్రజారాజధాని అమరావతిని నాశనం చేయాలని కంకణం కట్టుకున్న సైకో జగన్ విధ్వంసం ఆరంభించి నాలుగేళ్లైందని లోకేశ్ ధ్వజమెత్తారు. వేల కోట్ల విలువైన భవనాలు శిథిలం చేశారని, భూములు ఇచ్చిన రైతుల్ని హింస పెట్టారని మండిపడ్డారు. రోడ్లు, మౌలిక సదుపాయాలు ధ్వంసం చేయించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇన్ని చేసినా ప్రజారాజధాని అమరావతిని ఇంచు కూడా కదపలేకపోయారన్నారు. సైకో జగన్ అరాచక పాలన మూడు నెలల్లో ముగిసిపోతుందని, రైతుల త్యాగాల పునాదులపై వెలిసిన ప్రజారాజధాని అమరావతి అజరామరమై నిలుస్తుందన్నారు. వివిధ వర్గాల వారు యువనేతతో తమ సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తరువాత పరిష్కరిస్తామని లోకేశ్, వారికి భరోసా ఇచ్చారు. యువగళం యాత్రకు సంఘీభావంగా, హైదరాబాద్ నుంచి వచ్చిన ఐటీ ఉద్యోగులు లోకేశ్ తో కలసి నడిచారు. తెలుగుదేశంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. వైసీపీ అరాచక పాలన అంతం కావాలని కోరుకున్నారు.
టీడీపీ అధికారంలోకి వచ్చాక యాదవులకు రాజకీయ అవకాశాలు, కమ్యూనిటీ భవనాలు : లోకేశ్
పంచ గ్రామాల బాధితులతో లోకేశ్ ముఖాముఖి: లోకేశ్ యువగళం పాదయాత్ర, ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉత్సాహంగా సాగింది. దారి పొడవునా వివిధ వర్గాలతో మమేకమవుతూ లోకేశ్ ముందుకు కదిలారు. వేలాది మంది స్థానికులు, పార్టీ కార్యకర్తలు, మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు, జనసేన నేత పంచకర్ల రమేష్ తదితరులు లోకేశ్ వెంట నడిచారు. పెందుర్తి నియోజకవర్గంలోకి ప్రవేశించిన పాదయాత్రలో భాగంగా సింహాచల పంచ గ్రామాల బాధితులతో, లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. తమ భూములపై పూర్తి హక్కులు కల్పించాలని పంచ గ్రామాల బాధితులు, లోకేశ్ తో మొరపెట్టుకున్నారు. భూములపై హక్కులు లేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక, G.O.నెంబర్ 229 అమలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతామని లోకేశ్ భరోసా ఇచ్చారు.
ఏపీ ఉజ్వల భవిష్యత్తు కోసం లోకేశ్ వెంట- యువగళంలో తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ హుషారు