విశాఖ జిల్లా భీమిలి గ్రామ దేవత నూకాలమ్మను రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు చౌదరి సత్యారావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడిన మంత్రి.. కరోనా విజృంభిస్తున్నందున భక్తులంతా మాస్క్ ధరించి శానిటైజర్లు వినియోగించాలన్నారు. భౌతిక దూరం పాటిస్తూ అమ్మవారి దర్శనం చేసుకోవాలని సూచించారు.
కరోనా టీకా పట్ల ఎలాంటి అపోహలు వద్దని.. ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో కీర్తి శ్రీనివాస్, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక వైకాపా నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: తితిదే కీలక నిర్ణయం.. టైం స్లాట్ టోకెన్ల జారీ నిలిపివేత!