ETV Bharat / state

MURDER ATTEMPT : మద్యం మత్తులో స్నేహితుడిపై హత్యాయత్నం...కేసు నమోదు

మద్యం మత్తులో ఓ వ్యక్తి స్నేహితుడిపైనే కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన విశాఖ జిల్లాలో జరిగింది.

murder attempt in vishakha district
murder attempt in vishakha district
author img

By

Published : Nov 18, 2021, 1:02 PM IST

విశాఖలోని పాత డెయిరీఫాం కూడలిలో ఓ యువకునిపై స్నేహితుడే హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆరిలోవ టి.ఐ.సి. పాయింట్​కు చెందిన నిమ్మ ప్రసాద్ ఆటోడ్రైవర్. ఇతనికి పూర్ణ మార్కెట్ దరికల్లుపాకలకు చెందిన కిల్లి ప్రసాద్​తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో కిల్లి ప్రసాద్ జైలుకు వెళ్లి రెండు రోజుల క్రితమే బెయిల్​పై బయటకు వచ్చాడు. బుధవారం రాత్రి నిమ్మ ప్రసాద్​కు ఫోన్ చేసి మద్యం తాగుదామని రమ్మన్నాడు. తాగాక మత్తులో నిమ్మ ప్రసాద్​ను దూషించడంతో అతను ఆగ్రహంతో కిల్లి ప్రసాద్ మెడమీద కత్తితో పొడిచాడు. స్థానికులు ఆరిలోవ పోలీసులకు సమాచారం అందించారు. నిమ్మ ప్రసాద్​ను అదుపులోకి తీసుకుని క్షతగాత్రుడిని కేజీహెచ్​కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేశామని ఆరిలోవ ఎస్సై గోపాలరావు తెలిపారు.

ఇదీ చదవండి: MURDER : వివాహిత దారుణ హత్య...భర్తే హంతకుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.