జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చేపట్టిన లాంగ్‌మార్చ్‌పై వైకాపా నేతలు విమర్శలు గుప్పించారు. మంత్రులపై వ్యక్తిగత దూషణలకు దిగటానికి తప్ప మరెందుకూ ఇది ఉపయోగపడలేదని ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ దుయ్యబట్టారు. ఈ మార్చ్ ఏదో గాజువాకలో చేసుండాల్సిందంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వరదలు ముంచెత్తుతుంటే ఇసుకను ఎక్కడ్నుంచి తీసుకురావాలో చెప్పాలని ఎంపీ మార్గాని భరత్ అన్నారు. తెదేపా హయాంలో ఇసుక అక్రమాలు జరిగాయని... అప్పుడు పవన్‌కల్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదని ధ్వజమెత్తారు. మీరు చేసింది లాంగ్ మార్చ్ కాదు రాంగ్ మార్చ్ అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు.
ఇదీ చదవండి :