విశాఖ తూర్పు నియోజకవర్గ శాసన సభ్యుడు వెలగపూడి రామకృష్ణ బాబు.. సీఎం జగన్కు లేఖ రాశారు. నగరంలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయని అందుకు తగిన వైద్య సదుపాయాలు కల్పించాలని లేఖలో కోరారు. బ్లాక్ ఫంగస్ బాధితులకు కేవలం ఇరవై బెడ్లు ఉన్నాయని.. ఈ వ్యాధి చికిత్సకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే కరోనా వ్యాప్తి నివారణకు కృషి చేయాలన్నారు.
రోగులకు అవసరమైన మందులు, ఆక్సిజన్, వెంటిలేటర్లు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. విశాఖ జిల్లాపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: బ్లాక్ ఫంగస్ వ్యాధిగ్రస్తులకు సకాలంలో వైద్యం అందించండి: మంత్రి ఆళ్ల నాని