విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు విశాఖ మూడో పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి విడుదలయ్యారు. తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో ఉన్న అభిమానాన్ని తట్టుకోలేకే ఎంపీ విజయసాయిరెడ్డి తనను బలవంతపు అరెస్ట్ చేయించారని వెలగపూడి విమర్శించారు.
చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడిన వైకాపా నాయకులను వదిలేసి పోలీసులు తనను అన్యాయంగా అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డి ఎన్ని జిమ్మిక్కులు చేసినా.. తూర్పు నియోజకవర్గంలో 15 వార్డులను కచ్చితంగా గెలిచి తీరుతామని వెలగపూడి ధీమా వ్యక్తం చేశారు. తన రాజకీయ జీవితంలో ఇప్పటివరకు ఎప్పుడూ కూడా ఇలాంటి ఎన్నికలు చూడలేదని అన్నారు.
ఇదీ చదవండి: ఎమ్ఎస్ఎమ్ఈల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ: మంత్రి గౌతమ్ రెడ్డి