విశాఖ జిల్లా జి.మాడుగుల జీసీసీ గోదాంలో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి తనిఖీ చేశారు. రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయనే ఫిర్యాదుతో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. బియ్యం అక్రమ రవాణా తన దృష్టికి వచ్చిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. రికార్డుల్లో లెక్కలు స్పష్టంగా ఉండాలని ఆదేశించారు.
ఇదీ చూడండి..