ఏ రాజకీయ పార్టీ నడిపే వారికైనా సిద్ధాంతం, వ్యక్తిత్వం ముఖ్యమని అలాంటివి లేని వ్యక్తి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అని విశాఖలో విమర్శించారు అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్. మొన్నటి వరకు కమ్యూనిస్టు భావజాలంతో ఉన్నానని చెప్పుకొచ్చిన ఆయన... భాజపాతో మళ్లీ కొత్త పొత్తు ఏంటని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ కల్యాణ్... రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ గానో, ఎంపీటీసీ గానో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు.
ఇవీ చదవండి....'కేంద్రం పెద్దల మద్దతుతోనే రాజధాని మార్పు'