మున్సిపల్ ఎన్నికల్లో విశాఖ ప్రజలు వైకాపాకు పట్టం కట్టారని అనకాపల్లి ఎమ్మెల్యే, ఆ పార్టీ అధికార ప్రతినిధి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించిన ఆయన.. ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు.
వైకాపాకు ఓటు వేస్తే అమరావతి రాజధానిగా మార్చేందుకు మీరు ఓటు వేసినట్టేనని అన్నారని.. అక్కడ 44 స్థానాలను వైకాపా కైవసం చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు... విశాఖ, గూంటూరు పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలో ఈ విజయం సాధించామని ఎమ్మెల్యే అన్నారు.
ఇదీ చూడండి: