సింహాచలం గోశాల వివాదంపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. గోశాలలో పాతవారినే నియమించాలని దేవాదాయ శాఖ ప్రత్యేక కమిషనర్ అర్జునరావును ఆదేశించారు. కృష్ణాపురం, గోశాలకు సంబంధించి ఆరోపణలు సరికాదన్న మంత్రి.. దేవాలయాల విషయంలో రాజకీయాలకు తావులేదని స్పష్టం చేశారు.
సింహాచలం పాత గోశాలలోని 85కు పైగా దూడలను రాత్రికి రాత్రే దేవస్థానం అధికారులు తరలించినట్లు తెలిసింది. లేగ దూడలను ఎటు తీసుకువెళ్లారనే విషయంపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. గత కొద్ది రోజులగా గోశాలలో లేగదూడలు, పెయ్యలు చనిపోతున్నాయి. అనారోగ్యంతో బాధ పడుతున్న మూగజీవాలను తరలించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దూడల తరలింపు అంశంపై స్పందించిన మంత్రి పాతవారినే నియమించేలా చర్యలు చేపట్టారు.
ఇదీ చూడండి..