ETV Bharat / state

అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసిన మంత్రి అవంతి శ్రీనివాసరావు - minister avanthi srinivasarao news

విశాఖ జిల్లా భీమునిపట్నం మూడో వార్డులో పలు అభివృద్ధి పనులకు మంత్రి అవంతి శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో కలిసి పాదయాత్ర నిర్వహించారు.

Breaking News
author img

By

Published : Nov 19, 2020, 8:15 PM IST

విశాఖ జిల్లా భీమునిపట్నం జోన్​ 3వ వార్డులో రూ.87.60 లక్షలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంత్రి అవంతి శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. సీసీ రోడ్లు, కాలువలు, శ్మశాన వాటిక నిర్మించనున్నారు. కృష్ణా కాలనీలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లగా... ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలో దాతల సాయంతో నిర్మించనున్న కళ్యాణ మండపానికి భూమిపూజ చేసి..శిలాఫలకం ఆవిష్కరించారు మంత్రి.

ఎగువపేట నుంచి గంటస్తంభం వరకు కార్యకర్తలతో కలిసి మంత్రి పాదయాత్ర నిర్వహించారు. అనంతరం గంటస్తంభంలో జరిగిన బహిరంగ సభలో అవంతి శ్రీనివాసరావు పాల్గొన్నారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన వాటిలో 90% సంక్షేమ పథకాలు సంవత్సర కాలంలో అమలు చేసిన ఘనత జగన్మోహన్​ రెడ్డికే దక్కిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వార్డు అభ్యర్థులు, కార్పొరేటర్​, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: విశాఖ ఉక్కుపరిశ్రమ భూములు దక్షిణ కొరియాకు అప్పగించటంపై వ్యతిరేకత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.