ETV Bharat / state

నేడు ఏవోబీ బంద్.. అప్రమత్తమైన పోలీసులు - maoist

నేడు మావోయిస్టుల బంద్ పిలుపుతో ఏవోబీలో ఉద్రిక్తత నెలకొంది. దాడులు జరగవచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికతో పోలీసులు అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు. ప్రభావిత ప్రాంతాలకు అదనపు బలగాలను తరలించారు.

రేపు బంద్​కు మావోయిస్టుల పిలుపు... ఏవోబీలో నెలకొన్న ఉద్రిక్తత
author img

By

Published : Oct 2, 2019, 10:30 PM IST

Updated : Oct 3, 2019, 3:36 AM IST

ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో నేడు మావోయిస్టు పార్టీ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. గత నెల 22, 23న గూడెంకొత్తవీధి మండలం గుమ్మిరేవుల పంచాయతీలో జరిగిన రెండు ఎదురుకాల్పుల ఘటనలో అయిదుగురు మావోయిస్టులు మృతి చెందగా, మరొక మహిళా మావోయిస్టు నాయకురాలు గాయాలతో పట్టుబడిన సంగతి తెలిసిందే. ఆవిర్భావ వారోత్సవాలు సందర్భంగా సమావేశం నిర్వహించేందుకు వెళ్తుండగా ఏకపక్షంగా కాల్చిచంపారని మావోయిస్టులు ఆరోపిస్తూ బంద్​కు పిలుపునిచ్చారు.

అప్రమత్తమైన పోలీసులు...
మావోయిస్టులు బంద్‌కు పిలుపునివ్వడంతో సీలేరులో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. బంద్‌ సందర్భంగా విధ్వంస సంఘటనలకు పాల్పడే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాల హెచ్చరికతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టు అగ్రనేతలు ఇప్పటికే ఏవోబీ సరిహద్దులకు చేరుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాలైన జీకేవీధి, చింతపల్లి, కొయ్యూరు, జిమాడుగుల, డుంబ్రిగూడ, పెదబయలు, ముంచింగ్ పుట్ పోలీస్ స్టేషన్ లకు అదనపు పోలీసు బలగాలను అధికారులు తరలించారు. సీలేరు జ‌ల‌విద్యుత్కేంద్రం, ప్రభుత్వ కార్యాలయాల వద్ద రాత్రివేళల్లో గస్తీ నిర్వహిస్తున్నారు.

ఇవీ చూడండి-మూడేళ్లు సమయం ఇవ్వండి.. మార్పు మీరే చూడండి!

Intro:AP_VSP_56_03_NEDU AOB LO BANDH_AV_AP10153Body:
ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో గురువారం మావోయిస్టు పార్టీ ఆధ్వర్యంలో బంద్‌కు పిలుపునివ్వడంతో సరిహద్దుల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గత నెల 22,23న గూడెంకొత్తవీధి మండలం గుమ్మిరేవుల పంచాయతీలో జరిగిన రెండు ఎదురుకాల్పుల ఘటనలో అయిదుగురు మావోయిస్టులు మృతి చెందగా, మరొక మహిళా మావోయిస్టు నాయకురాలు గాయలతో పట్టుబడిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో ఆవిర్భావవారోత్సవాలు సందర్భంగా సమావేశం నిర్వహించడానికి వెళ్తుండగా ఏకపక్షంగా కాల్పులు జరిపి ముగ్గుర్ని హతమార్చగా, ఇద్దర్ని పట్టుకుని కాల్చిచంపారని మావోయిస్టులు ఆరోపిస్తూ ఈ సంఘటనకు నిరసనగా ఈ నెల 3న బంద్‌కు పిలుపునిచ్చారు. మావోయిస్టులు బంద్‌కు పిలుపునివ్వడంతో సీలేరులో పోలీసులు విస్రుతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. సరిహద్దుల్లో గురువారం నిర్వహించే బంద్‌ గురించి మావోయిస్టులు మన్యంలో పలు ప్రాంతాలలో వారం రోజులు ముందు నుంచే కరపత్రాలు వెదజల్లారు. . మావోయిస్టులు బంద్‌ సందర్భంగా విద్వంస సంఘటనలకు పాల్పడే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించడంతో బాటు అగ్రనేతలు ఇప్పప్పటికే ఆంధ్రా ఒడిశా సరిహద్దులకు చేరుకున్నారని భావిస్తున్న పోలీసులు వారిని ల‌క్ష్యం చేస్తూ సీలేరు, చింతపల్లి, గూడెంకొత్తవీధి ప్రాంతాల్లో శనివారం నుంచి గాలింపు ముమ్మరం చేశారు. మావోయిస్టులు ఎటువంటి హింసాత్మక సంఘటనలు పాల్పడకుండా పోలీసులు ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నారు. .మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాలైన జీకేవీధి, చింతపల్లి, కొయ్యూరు,జిమాడుగుల,డుంబ్రిగూడ,పెదబయలు,ముంచింగ్ పుట్ పోలీస్ స్టేషన్ లకు అదనపు పోలీసు బలగాలను అధికారులు తరలించారు.ఈనేపధ్యంలో స్థానిక పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపడుతున్నారు.కొత్త వ్యక్తులను ఆరా తీస్తున్నారు.సీలేరు జ‌ల‌విద్యుత్కేంద్రం మ‌రియు ప్రభుత్వ కార్యాలయాల వద్ద పోలీసులు రాత్రివేళల్లో గస్తీ నిర్వహిస్తున్నారు

Conclusion:M Ramanaeao,ap10153
Last Updated : Oct 3, 2019, 3:36 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.