జి.మాడుగుల మండలం బొంగరంలో విశాఖ ఈస్ట్ డివిజన్ కమిటీ పేరిట మావోయిస్టు పోస్టర్లు దర్శనమిచ్చాయి. బూటకపు పంచాయతీ ఎన్నికలను బహిష్కరించండి అంటూ... అందులో పేర్కొన్నారు. 73 సంవత్సరాల పార్లమెంటరీ వ్యవస్థలో దోపిడీ వర్గాలు... ప్రజలపై నియంతృత్వాన్ని, దోపిడీని అమలు చేసి, తమ అక్రమ సంపాదన పెంచుకుంటున్నాయని పోస్టర్లలో ఆరోపించారు. పీడిత ప్రజలకు మాత్రం ఆకలిచావులు, ఆత్మహత్యలు, నిరక్షరాస్యత, నిరుద్యోగం, పరాధీనతనే మిగిల్చాయని వ్యాఖ్యానం చేశారు.
రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం.. ప్రజలు పోరాడి సాధించుకున్న హక్కులను, జీవోలను రద్దు చేస్తూ కొత్త జీవోలతో.. మన్యంలో బాక్సైట్ వెలికితీతకు సిద్ధం అవుతోందని విమర్శించారు. పీడిత ప్రజలను "దోపిడీ చేసే ఈ బూటకపు ఎన్నికలను బహిష్కరించండి... దున్నేవాడిదే భూమి అడవిపై హక్కు ఆదివాసీలకే" అనే నినాదంతో ప్రజా యుద్ధంలో భాగస్వాములు కండి అంటూ పోస్టర్లలో పిలుపునిచ్చారు.
ఇదీ చదవండీ.. కొవిడ్ నిబంధనలతో తిరుమలలో కల్యాణాలకు పచ్చజెండా