ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు-పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ మావోయిస్టు మృతి చెందాడు. వారి వద్ద నుంచి ఒక పిస్టల్, దేశీయగన్, 15 కిట్ బ్యాగులు, వాకీటాకీ, వంటపాత్రలు, మావోయిస్టు సాహిత్యంతో బాటు ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాట్లు పోలీసులు తెలిపారు.
ఏవోబీలో మల్కన్‌గిరి జిల్లా ఖైర్‌పుట్ బ్లాక్ మత్లీ పోలీసుస్టేషన్ పరిధిలోని నున్‌ఖారీ అటవీప్రాంతంలో మావోయిస్టులు సంచారంపై పోలీసులకు అందిన కచ్చితమైన సమాచారం ఆధారంగా ఒడిశాకు చెందిన డీవీఎఫ్, ఎస్‌వోజీ బలగాలు గాలింపుచర్యలు నిర్వహించినట్లు ఒడిశా డీఐజీ రాజేష్ పండిట్ తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున పోలీసుల కదలికలు గమనించిన మావోయిస్టులు కాల్పులు ప్రారంభించినట్లు డీఐజీ తెలిపారు. ఇరువర్గాల మధ్య 45 నిమిషాల పాటు కాల్పులు జరిగాయన్నారు. తప్పించుకున్న మావోయిస్టులు కోసం గాలింపు చర్యలు నిర్వహిస్తున్నామన్నారు.
ఇదీ చదవండి