విశాఖ మన్యం పాడేరులో చెత్త ఏరుకునే వ్యక్తి చలికి తాళలేక ఆస్పత్రి సమీపంలో దొరికిన పీపీఈ కిట్ వేసుకుని పాడేరు పురవీధుల్లో సంచరించాడు. కొవిడ్ కిట్ వేసుకుని కనపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. హోటల్లో టీ తాగుతుండగా చుట్టుపక్కల వారు కరోనా పేషెంటా అంటూ ప్రశ్నించారు. ఆస్పత్రిలో సిబ్బంది వాడి పడేసిన పీపీఈ కిట్ ధరించుకొని వచ్చాడని తెలియగానే కొంత ఊపిరి పీల్చుకున్నారు. అయినప్పటికీ వైద్య సిబ్బంది వేసుకున్న పీపీఈ కిట్ ధరించడంతో అతనికి కరోనా సోకి ఉంటుందని స్థానికులు భయపడ్డారు. చలికాలం కావడంతో చలికి తాళలేక దొరికిన కిట్ వేసుకున్నానని ఆ వ్యక్తి తెలిపాడు.
ఇదీ చదవండి: జవాన్లతో కలిసి మోదీ దీపావళి వేడుకలు