తొమ్మిది రోజులు పాటు గణపతిని పూజించిన విశాఖ వాసులు గణేష్ మండపాలకు ఉద్వాసన చెప్పి భారీ ఊరేగింపుగా విశాఖ రామకృష్ణ బీచ్ లో నిమజ్జనం చేశారు. బీచ్ లో కోస్టల్ బ్యాటరీ ప్రాంతంలో నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు చేయగా..గజ ఈతగాళ్లతో పాటు, పోలీసులు రక్షణగా నిలిచారు.
అనకాపల్లి వినాయక విగ్రహాలు నిమజ్జనం ఘనంగా జరిగింది. ప్రతి వీధి మండపాల్లోని విగ్రహాలకు ప్రత్యేక పుజలు చేసి ఊరేగింపుగా నిమజ్జనానికి శారదానది ఘాట్ వద్దకు తీసుకువచ్చారు. నిమజ్జనోత్సవ కార్యక్రమంలో భాగంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి..క్రేన్ల సహాయంతో గణపయ్యలను నీట విడిచారు.
అనకాపల్లి ఎంపీ డాక్టర్ బి.వెంకట సత్యవతి, విష్ణుమూర్తి దంపతుల ఆధ్వర్యంలో వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ నేతృత్వంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గణపయ్యకి ప్రత్యేక పూజలు, భారీ అన్నసమారాధన కార్యక్రమం జరపగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాల నుంచి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించటం పరిపాటి.
ఇదీ చూడండి: ఓ బొజ్జ గణపయ్య... పూలతో అలంకరించామయ్యా..