ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీకేజీకి కారణం ఏంటనే విషయాన్ని పరిశీలించడానికి దక్షిణ కొరియా నుంచి వచ్చిన 8మందికి హైకోర్టులో ఊరట లభించింది. వారు స్వదేశం వెళ్లేందుకు షరతులతో హైకోర్టు బుధవారం అనుమతులిచ్చింది. శాశ్వత చిరునామాలు, కంపెనీ వివరాలు, ఫోన్ నెంబర్లు హైకోర్టుకు ఇవ్వాలి. 'గ్యాస్ లీక్ కేసులో కోర్టు విచారణకు ఎప్పుడు రమ్మంటే అప్పుడు హాజరుకావాలి. దర్యాప్తులో భాగంగా పోలీసులు వివరాలు కోరితే ఇవ్వాలి' అని షరతులు విధించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ కె.లలితలతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చదవండి:
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు