నడిరోడ్డుపై వెంకటేశ్వర రావు అనే న్యాయవాదిని హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖలో న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. న్యాయాన్ని పరిరక్షించే న్యాయవాదులను హత్య చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా కోర్టు సముదాయం ప్రాంగణంలో విశాఖపట్నం బార్ అసోసియషన్ మెంబర్ పలకా శ్రీ రామమూర్తి డిమాండ్ చేశారు. సమాజంలో న్యాయవాదులకే రక్షణ లేకపోతే ఇక సామాన్య ప్రజానీకం పరిస్థితి ఏంటని న్యాయవాదులు ప్రశ్నించారు. ప్రజలందరికీ న్యాయం చేసే న్యాయవాదులను కాపాడుకొనే బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం బార్ అసోసిషన్ సభ్యులు బైపా అరుణ్ కుమార్, సన్నీ యాదవ్, పైలా శ్రీనివాసులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: తాగొచ్చి తల్లిని కొడుతున్నాడని.. మారు తండ్రిని హతమార్చిన 13 ఏళ్ల కుర్రాడు..!