తుని ప్రాంతానికి చెందిన సూరిశెట్టి ప్రసాద్, కొయ్యూరు నారాయణ ప్రసాద్‌లు కలసి విశాఖపట్నానికి చెందిన కర్రీ వీర్రాజు మరి కొంతమంది నుంచి వెంకోజీపాలెం ప్రాంతంలో భూమిని కొనుగోలు చేశారు. 735 చ.గ ఖాళీ స్థలాన్ని రిజిస్టర్ అగ్రిమెంట్ చేసుకొన్నారు. అంతవరకు బాగానే ఉన్నా.. కొంతకాలం తర్వాత భూముల విలువలు పెరిగాయన్న నెపంతో.. స్థల యజమాని ఆ స్థలాన్ని వేరే వారికి విక్రయించటంతో పాటు నిర్మాణాలు చేపట్టారు. అది తెలుసుకొన్న సూరిశెట్టి ప్రసాద్, కొయ్యూరు నారాయణ ప్రసాద్‌లు స్థల యజమాని కర్రి వీర్రాజును ప్రశ్నించినప్పటికీ ప్రయోజనం లేకపోవటంతో బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
కోర్టు ఆదేశాలను పట్టించుకోవటం లేదు..
2వ అదనపు జిల్లా జడ్జ్ న్యాయస్థానం కట్టడాలు ఆపాలంటూ గత ఏడాది డిసెంబర్ 14న స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చింది. ఆపై జీవీఎంసీ, స్టేట్ బ్యాంక్, ఇండస్ట్రియల్ ఎస్టేట్ వాళ్లకు కూడా రిజిస్టర్ లాయర్ నోటీసుల ద్వారా తెలియపరిచారు. అయినప్పటికీ కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి ఆ స్థలంలో కట్టడాలు కడుతూనే ఉన్నారని బాధితులు తెలిపారు. దీనిపై జీవీఎంసీ, స్టేట్ బ్యాంక్, ఇండస్ట్రియల్ ఎస్టేట్ అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. కోర్టు ఆర్డర్‌ను ధిక్కరించి కట్టడాలు కడుతున్న వారిపై కంటెంప్ట్ అఫ్ కోర్టు కిందగా న్యాయస్థానంలో ఫిటిషన్ దాఖలు చేసినట్లు బాధితులు వెల్లడించారు. తాము ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని.. అక్రమ నిర్మాణాలు కొనసాగిస్తూనే ఉన్నారని బాధితులు ఆవేదన చెందుతున్నారు.
ఇవీ చూడండి...