విశాఖ జిల్లాలో వర్షాలు తగ్గటం లేదు. జలాశయాల్లో నీటి మట్టం పూర్తిస్థాయికి చేరుకుంది. సాగు నీటి చెరువులు, పంట కాలువలు కొత్తనీటితో కళకళలాడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో పొలాలు సైతం చెరువులను తలపిస్తున్నాయి.
నర్సీపట్నం డివిజన్లోని రోలుగుంట, రావికమతం, మాకవరపాలెంలో.. వరి పొలాలు వరదలో మునిగిపోయాయి. చెరువుల నుంచి పొలాల్లోకి నీటితో పాటు.. అందులో ఉన్న మత్స్య సంపద సైతం చేరుతోంది. గమనించిన స్థానికులు పొలాల్లో చేపలు పడుతున్నారు.
ఇదీ చదవండి: