ETV Bharat / state

సీఎం జగన్ బీసీల పక్షపాతి: జంగా కృష్ణమూర్తి - విశాఖ తాజా వార్తలు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బడుగుల సంక్షేమానికి పెద్దపీట వేశారని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు. విశాఖలోని వైకాపా రాష్ట్ర బీసీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

Janga krishna murthy
Janga krishna murthy
author img

By

Published : Jun 4, 2020, 4:47 PM IST

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీల పక్షపాతి అని… లక్షా 9,308 కోట్ల రూపాయల మేర బడుగుల సంక్షేమం కోసం వివిధ పథకాల ద్వారా అందిస్తున్నారని స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రివర్గంలో 60 శాతం మంది బడుగులకు ప్రాతినిధ్యం ఇచ్చారని అన్నారు.

50 శాతం నామినేటెడ్ పోస్టులను బడుగులకు కేటాయించారని అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా బడుగుల సంక్షేమ కార్యక్రమాలను చేరువ చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు.

ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీల లో 90 శాతం మేర ఏడాది కాలంలోనే నెరవేర్చారని జంగా కృష్ణమూర్తి స్పష్టం చేశారు. అంబేడ్కర్, మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా జగన్ పరిపాలనను అందిస్తున్నారని వివరించారు.

ఇదీ చదవండి: 'ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.